raja nee sanidhilo | John J - John J Lyrics

Raja Nee Sanidhilo - Download

SingerJohn J
ComposerSareen Imman
MusicSareen Imman
Song WriterJohn J

Lyrics

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య||2||
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య||2||
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య||2|| ||రాజా ||

నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం||2||
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును||2||
నీవే రాకపోతే నేనేమైపోదునో||2||
||రాజా ||

ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా||2||
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు||2||
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య||2||
||రాజా ||

ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా||2||
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము||2||
నిన్ను మించిన దేవుడే లేడయ్య||2||
||రాజా ||