neetho naa jeevitham | Hosanna Ministries - Hosanna Ministries Lyrics


neetho naa jeevitham | Hosanna Ministries



NEETHO NAA JEEVITHAM - DOWNLOAD


SingerHosanna Ministries
ComposerHosanna Ministries
MusicHosanna Ministries
Song WriterHosanna Ministries

Lyrics

నీతో నా జీవితం సంతోషమే
నీతో నా అనుబంధం మాధుర్యమే ||2||
నా యేసయ్యా కృప చూపుచున్నావు – వాత్సల్యపూర్ణుడవై
నా యేసయ్యా నడిపించుచున్నావు – స్ఫూర్తిప్రదాతవై
ఆరాధ్యుడా యేసయ్యా…
నీతో నా అనుబంధం మాధుర్యమే

1. భీకర ధ్వనిగలా మార్గమునందు నను స్నేహించిన నా ప్రియుడవు నీవు ||2||
కలనైన మరువను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం ||2||
||ఆరాధ్యుడా||

2. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే ||2||
నిత్యమైన మహిమలో నను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నను మార్చుచున్నావు ||2||
||ఆరాధ్యుడా||

3. ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని ||2||
నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నను నింపుచున్నావు ||2||
||నీతో నా||